కరుప్పు హిట్‌తో పెరిగిన త్రిష డిమాండ్... రెమ్యునరేషన్‌పై షాకిచ్చిన హీరోయిన్

ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాటట్ టాపిక్‌గా మారారు త్రిషా కృష్ణన్. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో త్రిష ఏం చేసినా, ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో త్రిష గురించి రకరకాల గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె పారితోషికం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళనాడు ఎన్నికలు, ఆ తర్వాత కూడా త్రిష- విజయ్‌ల చుట్టూనే ఆ రాష్ట్ర సినీ, రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్నికల రోజు నుంచి ఇప్పటి వరకు విజయ్ ఎక్కడుంటే త్రిష అక్కడ ఉంటున్నారు. కౌంటింగ్ రోజున తిరుమల వెళ్లి అక్కడి నుంచి నేరుగా విజయ్ నివాసానికి విజయ్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారంలోనూ సందడి చేశారు. ఆ తర్వాత అజిత్ తల్లిగారు కన్నుమూయడంతో ఆయనను పరామర్శించడానికి విజయ్‌తో కలిసి ఒకే కారులో చేరుకున్నారు. ఈ పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

Trisha Krishnan s Remuneration Actress Reportedly Demands 15 Crore for New Film

దళపతి విజయ్ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌లలో విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక స్థానంలోనే కొనసాగాల్సి ఉండటంతో తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకుని పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు దళపతి. అయితే తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిషను బరిలో దించబోతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. ఎప్పటికైనా తమిళనాడు సీఎం అవుతానని చెప్పడం రాజకీయాలపై త్రిష ఆసక్తిని తెలియజేస్తోంది. అయితే ఇప్పుడు త్రిష స్థానంలో రాఘవ లారెన్స్ పేరు వినిపిస్తుండగా.. దళపతి విజయ్ నిర్ణయంపై ఆసక్తి కనిపిస్తోంది.

ఇదిలాఉండగా.. త్రిషకు ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. తన మిత్రుడు విజయ్ ఏకంగా తమిళనాడు సీఎం అయ్యారు. అలాగే ఆమె నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్య సరసన ఆమె నటించిన కరుప్పు చిత్రం సంచలన విజయం సాధించింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లతో సూర్య కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ చిత్రం. తద్వారా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లయ్యింది.

కరుప్ప బ్లాక్‌బస్టర్‌తో త్రిష క్రేజ్, మార్కెట్ మరింత పెరిగింది. ఆమెతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి బడా సంస్థలు, దర్శకులు క్యూ కడుతున్నారు. ఆ క్రమంలోనే ఓ చిత్ర యూనిట్ .. త్రిషను తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుందట. వెంటనే త్రిషను కలిసి కథ వినిపించగా ఆమె వైపు నుంచి సానుకూల స్పందన వచ్చిందట. అయితే రెమ్యునరేషన్ విషయంలో త్రిష డిమాండ్ చూసి సదరు యానిట్‌కు మైండ్ బ్లాక్ అయ్యిందంట.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్న ఈ సినిమా కోసం త్రిష అక్షరాలా 15 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు కోలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో సదరు నిర్మాత.. త్రిషను హీరోయిన్‌గా పెట్టుకోవాలా? వద్దా అన్న దానిపై డైలమాలో పడ్డాడట. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం ఇప్పటికీ తగ్గని త్రిష క్రేజ్‌ను, డిమాండ్‌ను తెలియజేస్తోంది. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్ సరసన రామ్ మూవీలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X