పెళ్లి పీటలెక్కనున్న త్రిష.. అతడితో పీకల్లోతు ప్రేమలో..
Recommended Video

దక్షిణాది సినీ పరిశ్రమలో త్రిషా కృష్ణన్‌ది సుమారు రెండు దశాబ్దాల కెరీర్. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు తీసిపోని అందం. అలాగే కొత్త హీరోయిన్లు ఎందరొచ్చినా ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం ఆమె క్రేజ్‌కు అద్దంపట్టింది. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో త్రిష దుమ్మురేపుతున్నది. ఈ ఏడాది త్రిష పెళ్లి చేసుకోబోతున్నదంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె తన పెళ్లి గురించి స్పందించారు.

2015లో పెళ్లి క్యాన్సిల్
వాస్తవానికి 2015లోనే త్రిష పెళ్లిపీటలెక్కాల్సింది. వరుణ్ మానియన్ అనే తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం జరుగడం, నెలరోజుల ముందు పెళ్లి క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందో కారణాలు తెలియరాలేదు.

బిందుమాధవితో వరుణ్ మానియన్
అయితే తెలుగు నటి బిందుమాధవితో వరుణ్ మానియన్ మాల్దీవుల్లో డేటింగ్ చేస్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. ఆ కారణంగానే త్రిష పెళ్లి ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే బిందుమాధవి కేవలం నాకు స్నేహితురాలే. నేను మాల్దీవులకు వెళితే అక్కడ ఆమె కలిసింది అని వరుణ్ మానియన్ వివరణ ఇచ్చారు.

బిజినెస్‌మ్యాన్‌తో అఫైర్
పెళ్లి రద్దు తర్వాత తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది అనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. రెండు సంవత్సరాలు వారి మధ్య అఫైర్ కొనసాగుతున్నట్టు ప్రచారమైంది. కానీ అలాంటి వార్తలకు త్రిష నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఈ ఏడాదిలోనే మ్యారేజ్
ఇటీవల త్రిషా పెళ్లికి సిద్దమవుతున్నారు. ఆమె పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేస్తున్నారనే వార్తలు రావడంతో ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలో త్రిష మాట్లాడుతూ.. నా పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలను తగ్గించుకొన్నాను. పెళ్లి, భర్త, దాంపత్య జీవితం అనే అంశాలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది అని అన్నారు.

సరైన వ్యక్తి కోసం
ఒకవేళ పెళ్లి చేసుకొంటే ప్రేమ వివాహమే చేసుకొంటాను. సరైన వ్యక్తి కోసం చూస్తున్నాను. కచ్చితమైన వ్యక్తి లభిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని త్రిషా చెప్పారు. రానా దగ్గుబాటితో కూడా అఫైర్ ఉంది అనే విషయం గత కొద్దికాలంగా ప్రచారంలో ఉంది. రానా, త్రిషాల ఫొటోలు సుచీలీక్స్‌లో బయటపడ్డాయి. అయితే వారి మధ్య బాల్యం నుంచే స్నేహం ఉంది. తమ మధ్య అఫైర్ లేదని, స్నేహితులం మాత్రమే అని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











