ధనుష్‌తో లేట్ నైట్ పార్టీలో హీరోయిన్ త్రిష
హైదరాబాద్: లేట్ నైట్ పార్టీలు, పబ్బులు, డిస్కోలు....తప్ప తాగి మీడియా కంట్లో పడటం లాంటి పనులు చేయడంలో సౌతిండియాకు సంబంధించిన హీరోయిన్లలో త్రిష తర్వాతే ఎవరైనా. తాజాగా త్రిష ఇలాంటి మరో వార్తతో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ హీరో ధనుష్‌తో కలిసి లేట్ నైట్ పార్టీకి త్రిష వెళ్లినట్లు తెలుస్తోంది.
పార్టీలో త్రిషను, ధనుష్‌ను చూసిన వారు....ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఇద్దరూ స్నేహితుల్లా పైకి ఫోజు కొడుతున్నప్పటికీ ఇద్దరి మధ్య అంతకు మించిన చనువు కనిపిస్తోందని అంటున్నారు. దీంతో ఈ ఇద్దరి వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.

విచిత్రం ఏమిటంటే....త్రిష కోలీవుడ్లో దాదాపు అందరు స్టార్స్‌తో నటించింది. కేవలం రజనీకాంత్, ధనుష్‌తో మాత్రమే త్రిష ఇంత వరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ చూస్తుంటే త్వరలో ధనుష్, త్రిష కలిసి సినిమాలో నటించే అవకాశం ఉందని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











