మొన్న బుజ్జిగాడ్ని కవ్వించిన త్రిషకి టట్టూస్ అంటే భలే పిచ్చి. దాంతో ఇంతకు ముందు ఆమె తన మెడ క్రింది భాగంలో breast దగ్గరలో చేప బొమ్మని టట్టూ గా గీయించుకుంది. అది ఆమె నెక్ లైన్ టాప్ జాకెట్ వేసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించేది. ఆమె కూడా పార్టీలుకు అటెండయినప్పుడు దానిని గర్వంగా చూపించటానికి ప్రయత్నించేదని సన్నిహితులు చెప్తూంటారు. ఇక చేప ని టట్టూగా వేసుకోవటానికి కారణం అది వేసుకోవటం అంటే సంపదని ఆహ్వానించటమని నమ్మకమట. ఆ టట్టూని వేయించుకోవటానికి ఆమెకు మూడు గంటలు పట్టిందిట. అలాగే ఇప్పుడు కూడా మరో టట్టూని మొన్న చెన్నైలో వేయించుకుందిట. అయితే ఈ సారి అందరికీ కనపడే ప్రాంతంలో ఎడమ చేతిపై వేయించుకుందిట. ఈ విషయాన్ని మొన్న ఫ్యాషన్ షో లో అందరూ గమనించారుట. సొ...త్రిష టట్టూల ప్రేమ కొనసాగుతూనే ఉందన్నమాట. దాంతో అది విన్న వాళ్ళు త్రిషకి ఆ పిచ్చింకా పోలేదా అని నిట్టూర్చారుట.