Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెరైటీ ట్విస్ట్: త్రిష వివాహం విమానంలో..?
హైదరాబాద్: తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష వివాహం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 23న వీరి నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఆమె పెళ్లి విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అందరిలా సాదా సీదాగా కాకుండా....వెరైటీగా పెళ్లి జరుపుకునేందుకు ప్లాన్ చేసకుంటున్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఈ మధ్య కొందరు ప్రపంచం దృష్టిని ఆకర్షించుకునేందుకు పారాచూట్ పెళ్లి, సముద్రం అడుగున నీటిలో పెళ్లి, ఆకాశంలో విమానంలో పెళ్లి లాంటివి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. త్రిష కూడా అదే తరహాలో చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటోందట. విమానంలో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు టాక్. అదే నిజమైతే ఇండియా వ్యాప్తంగా త్రిష పెళ్లి మారు మ్రోగి పోవడం ఖాయం.

23న వివాహ నిశ్చితార్థం కూడా జరుగబోతోంది. చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నిశ్చితార్థ వేడుక జరుగనుంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. కాగా...మరుసటి రోజు(జనవరి 24)న సౌతిండియాలోని సినీ ప్రముఖులందరినీ పిలిచి భారీగా విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. అందరికీ స్వయంగా ఫోన్లు చేసి తప్పకుండా రావాలంటూ ఆహ్వానాలు పలుకుతోందట త్రిష. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ పెళ్లికి ముందే ఇంత పెద్ద విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
ఎంగేజ్మెంట్ సందర్బంగా త్రిష అత్యంత ఖరీదైన గిఫ్టు అందుకోనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ఆమెకు రూ. 7 కోట్ల విలువ చేసే జెట్ బ్యలాక్ కలర్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తోలుస్తోంది. కట్టుకునే వాడు ధనవంతుడైతే ఇలాంటి గిఫ్టులు కొనివ్వడంలో వింతేమీ లేదులెండి. మొత్తానికి త్రిష కోరుకున్న విధంగా మరింత లగ్జరీ లైఫ్ గడపబోతోందన్నమాట.
పెళ్లి తర్వాత కూడా త్రిష సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ‘నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు ఏమీ చెప్పలేదు. మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేయబోతున్నాను. ఈ సంవత్సరం విడుదలయ్యే నా సినిమాలపై దృష్టి సారించాను' అని త్రిష స్పష్టం చేసింది.