కమల్ హాసన్‌తో హీరోయిన్ త్రిష తల్లి?
సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష తల్లి ఉమ కృష్ణన్ ఆ మధ్య ఒక వాణిజ్య ప్రకటనలో త్రిషతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఉమ కృష్ణన్ ఆకట్టుకునే రూపం, నటన చూసి చాలా మంది దర్శకులు ఆమెను తమ సినిమాల్లో నటింప చేయాలనే ఆలోచన చేశారు. అప్పట్లో కమల్ హాసన్ సినిమా మన్మథన్ అంబు చిత్రంలో ఉమకు ఆఫర్ కూడా వచ్చింది. అప్పుడు ఉమ నటించడానికి ఓకే చెప్పిందనే వార్తలు వినిపించాయి కానీ, ఆచరణలోకి రాలేదు. కారణం ఆ సమయంలో త్రిష ఫిల్మ్ కెరీర్ సంక్షోభంలో ఉండటమే అనే వాదన వినిపించింది.
తాజా వివరాల్లోకి వెళితే....త్రిష కెరీర్ గ్రాఫ్ మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో నటించడానికి ఉమ కృష్ణన్ సుముఖత చూపుతున్నారనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. మళ్లీ కమల్ హాసన్ సినిమా ద్వారానే వెండితెర అరంగ్రేటం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సారైనా ఈ వార్తలు నిజమౌతాయో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











