జూ ఎన్టీఆర్ తో అప్పుడు బెట్టు చేసింది ఇప్పుడు కావాలంటోంది...!
థర్టీ బోర్డర్ కి చేరుకున్న త్రిషని ఇండస్ట్రీ యంగ్ హీరోయిన్ గా కన్సిడర్ చేయడం ఏనాడో మానేసింది. ప్రస్తుతం ఆమెతో పవన్, వెంకటేష్, రవితేజ తదితర ఫార్టీ ప్లస్ హీరోలే నటిస్తున్నారు. తమిళంలోనూ అజిత్ లాంటి తెల్లజుట్టు హీరోలతోనే త్రిష నటిస్తోంది. తనకి తెలియకుండానే 'ఆంటీ" ఇమేజ్ తెచ్చుకున్న త్రిష ఇప్పుడు ఆ ముద్ర చెరిపేసుకోవాలని చూస్తోంది. ఎవరైనా యంగ్ హీరోతో నటిస్తే తప్ప తనని మిగిలిన యువకులు గుర్తించరని ఆమె భావిస్తోంది.
సిద్దార్థ, ప్రభాస్ లాంటి వారితో సినిమాలు చేసినా కానీ వాళ్లు థర్టీ ప్లస్ హీరోలే కాబట్టి అది ఆమెకి పనికిరావడంలేదు. అందుకే జూ ఎన్టీఆర్ తో ఒక సినిమా ఛాన్స్ వస్తే కరెక్టుగా ఉంటుందని త్రిష ఆశపడుతోంది. గతంలో ఆమెతో నటించడానికి ఎన్టీఆర్ ఎన్నిసార్లు ప్రయత్నించినా త్రిష ఆశ పడుతోంది. గతంలో ఆమెతో నటించడానికి ఎన్టీఆర్ ఎన్నిసార్లు ప్రయత్నించినా త్రిష అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అతడెప్పుడు పిలుస్తాడా అంటూ ఎదురుచూస్తోంది. పవన్ పక్కనే ముదురుగా కనిపించిన త్రిషని ఎన్టీఆర్ హీరోయిన్ గా పెట్టుకోవడం దాదాపు అసాధ్యమే అనాలి.


Click it and Unblock the Notifications











