twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూడ్ బేబీకి షాక్..ఎన్టీఆర్ ‘దమ్ము’లో త్రిష?

    By Bojja Kumar
    |

    టాప్ లెస్ అందాలతో ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ పై దర్శనం ఇచ్చి న్యూడ్ బేబీగా పేరుతెచ్చుకున్న కాజల్.. ఎన్టీఆర్ 'దమ్ము" నుంచి శృతి హాసన్ తప్పుకోవడంతో ఆస్థానంలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వేరే పేరు వినిపిస్తోంది. ఆ స్థానాన్ని సీనియర్ నటి త్రిష చేజిక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ అయోమయం తొలగాలంటే సినిమా యూనిట్ సభ్యలు నుంచి అధికారిక సమాచారం వెలువడితే బాగుంటుందని అభిమానుల అభిప్రాయం.

    యువ కథానాయికల జోరులో ఈ మధ్యకాలంలో కొంత వెనకబడిపోయిన త్రిష తెలుగులో తాజాగా వెంకటేష్ సరసన 'గంగ ది బాడీగార్డ్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. త్వరలో త్రిష దమ్ము షూటింగ్ లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష ఎన్టీఆర్ తో జత కట్టడం ఇదే తొలిసారి.

    మరో హీరోయిన్ గా రంగం సినిమా హీరోయిన్ కార్తీక నటిస్తోందని తెలుస్తోది. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ మీడియా బ్యానర్ పై అలగ్జాండర్ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    English summary
    Film nagar source revealed that...Jr.NTR To Pair With Trisha and Karthika In Dammu Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X