బాలకృష్ణ సరసన త్రిష ఎంపిక?
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే చిత్రంలో త్రిష మొయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యిందని సమాచారం. ఈ చిత్రంలో ఇప్పటికే కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేతాబసు ఎంపికయిందనే సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. త్రిష, బాలకృష్ణలది ఇది తొలి కాంబినేషన్. ఇక శ్వేతాబసు గతంలో బెల్లంకొండ నిర్మాతగా వచ్చిన రైడ్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఇక బెల్లంకొండ, బాలకృష్ణల కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. మొదట చెన్నకేశవ రెడ్డి, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ చిత్రాలు బెల్లంకొండ భారీగా నిర్మించారు. ఇక ఈ పూరీతో చేయబోయే చిత్రం గురించి బెల్లంకొండ...బాలయ్యబాబు కెరీర్ లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ ప్రి రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.


Click it and Unblock the Notifications











