ఏజ్ బార్ హీరోలతో చేయనని ఇప్పుడు బాలకృష్ణతో ఒప్పేసుకొన్నది
తెలుగులోని మనసు నాకు తెలుసు చిత్రంతో కెరీయర్ స్టార్ట్ చేసిన త్రిష ఆ చిత్రం లో తరుణ్ సరసన హీరోయిన్ గా నటించినది. ఆ తర్వాత కూడా సిద్దార్థ, నితిన్, ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింనది. ఓ సందర్బంలో ఎజ్ బార్ హీరోలతో చేయనని చెప్పేసింది. ఆ టైం లోనే స్టాలిన్ లో నటించమని అంటే మొదట నో అన్నది.ఎవరు ఒప్పిచరో తెలియదు కానీ ఆ సినిమాలో చేసింది.ఇక వెంకటేష్,రవితేజ.పవన్ కళ్యాణ్ తో కూడా నటించింది.తనకు అవకాశాలు తగ్గుతున్నాయి అన్న అనుమానం తో ఏవరితో అన్న చేయడానికి రెడీ అవుతున్నది.వెంకటేష్ తో రెండు సినిమాలు తీసిన త్రిష మూడో సినిమాకు రెడీ అవుతుంది.అందరు హీరొయిన్ లగే తనుకూడా చివరికి బాలకృష్ణ దగ్గరకు చేరింది.
తన కెరీర్ ఇక ముగింపు దశకు చేరుకుందనుకుంటున్న తరుణంలో చెన్నయ్ అందం త్రిష, తెలుగులో ఇప్పుడు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల పవన్ కల్యాణ్ తో 'తీన్ మార్' సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా వెంకటేష్ తో 'బాడీగార్డ్' తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా బాలకృష్ణ సరసన నటించే చాన్స్ కూడా త్రిష పొందినట్టు తెలుస్తోంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్ వంటి హీరోలతో త్రిష సినిమాలు చేసింది కానీ, బాలకృష్ణతో ఇంతవరకు చేయకపోవడం విశేషం. ఇప్పుడా వెలితి తనకు తీరుతున్నట్టు ఆమె భావిస్తోంది. 'హరహర మహాదేవ' సినిమాలో బాలకృష్ణ సరసన ఆమె నటించే అవకాశం వుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











