త్రిషకు మ్యాప్ గీసిన బాలకృష్ణ
బాలకృష్ణ సరసన చేయటానకి రిటైరైపోయిన ముంబై భామలు తప్ప రన్నింగ్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరూ ఆసక్తి చూపటం లేదు. దాంతో సినిమాకు తనే పూర్తిగా క్రేజ్ తేవాల్సి వస్తోంది. ఈ నేపద్యంలో ఆఫర్స్ లేక విలవిల్లాడుతున్న త్రిష ఆయన దృష్టిలోకి వచ్చింది. వెంటనే ఆమెను ఎప్రోచ్ అవమని తన నిర్మాతను ఆయన పురమాయించాడు. ఆ నిర్మాత మరెవరో కాదు బెల్లంకొండ సురేష్. ఆమెతో బెల్లంకొండ ప్రస్తుతం బాడీగార్డు రీమేక్ చేస్తున్నాడు. వెంకటేష్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కుతోంది. అలా పెరిగిన చనువుతో ఆమెను ఎప్రోచ్ అయ్యి మంచి పేమెంట్ ఆఫర్ చేసి అడిగాడని తెలుస్తోంది. ఆమె కూడా పెద్దగ ఆలోచించకుండా వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసం అమెను ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రం టైటిల్ హరహర మహాదేవ. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటివరకూ బి గోపాల్ కి ఈ చిత్రం కథ ఓకే కాలేదని తెలుస్తోంది. ఈ టైటిల్ కి తగ్గ కథ కోసం ఆయన గత ఆరు నెలలుగ కంటిన్యూగా కథలు వింటూనే ఉన్నారు.స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటూనే ఉన్నారు. హీరోయిన్ కూడా ఓకే అయిన నేపద్యంలో ఆయన త్వరగా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. లేకపోతే బాలకృష్ణ డేట్స్ వేస్ట్ అవుతాయి.


Click it and Unblock the Notifications











