రామ్ చరణ్ తేజ సరసన హాట్ స్టార్ త్రిష
రామ్ చరణ్ తేజ హీరోగా చేయబోయే తదుపరి చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేయనుందని సమాచారం. ఈ మేరకు యుఎస్ లో రీసెంట్ గా కలుసుకున్న వీరిద్దరూ ఓ అంగీకారానికి వచ్చి పార్టీ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ప్లోర్ మీదకు 2011లో వెళ్లుతుంది. తమిళ దర్శకుడు ధరణి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ధరణి గతంలో పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రాన్ని రూపొందించారు. ఇక త్రిష ఇంతకు ముందు చిరంజీవి సరసన స్టాలిన్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ హిట్ క్రిష్ ఫార్మెట్ లో భారీ గ్రాఫిక్స్ తో ఉండే ఈ చిత్రం సూపర్ మ్యాన్ కాన్సెప్ తో స్క్రిప్టు తయారవుతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తున్నాడు. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించే ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది.
రామ్ చరణ్ తేజ్ త్రిష చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ జెనీలియా ఆరెంజ్ ram charan teja trisha chiranjeevi nagababu pawan kalyan bommarillu


Click it and Unblock the Notifications