సూపర్ హిట్ డైరెక్టర్ కి షాకిచ్చిన త్రిష.. అలాంటి కధే అయినా నో అంటూ!
తెలుగులో కొన్నాళ్ళ పాటు ఒక వెలుగు వెలిగిన త్రిష ఇప్పుడు పూర్తిగా తెలుగు సినిమాలు చేయడమే ఆపేసింది. అవకాశాలు రావడం లేదో లేక వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదో తెలియదు కానీ ఆమె తెలుగు సినిమా చేసి మూడేళ్ళు దాటింది. తాజాగా ఒక అపజయం ఎరుగని దర్శకుడు ఆమెను ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తో అప్రోచ్ కాగా ఆమె దానిని తిరస్కరించినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

ఆ సినిమాతో ఎంట్రీ
నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో 2003 సంవత్సరంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త్రిష ఆ తర్వాత చేసిన రెండో సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ప్రభాస్ సరసన వర్షం సినిమాలో శైలజ పాత్రలో నటించి ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

వరుస సినిమాలతో
ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, స్టాలిన్, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా వరుస సినిమాలతో హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే గత కొన్నాళ్ల బట్టి ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. చివరిగా ఆమె నాయకి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్కడ ఫుల్ బిజీ
ఇక్కడ సినిమాలు చేయకపోయినా ఆమె తమిళంలో మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. 96 సినిమాలతో హిట్స్ కూడా అందుకుంటోంది. ఆమె చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ అధికారిక ప్రకటన వచ్చాక ఆమె కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరు చెబుతూ సినిమా నుంచి తప్పుకుంది.

వెనక్కు పంపేసింది
అయితే ఆమె మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందని అయితే ఈసారి ఆషామాషి సినిమాలు కాకుండా పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని ప్రచారం కొద్ది రోజుల నుంచి జరుగుతోంది. అయితే అందరూ అది నిజమేనని భావించారు. అయితే అలాంటిది లేడీ ఓరియెంటెడ్ కథతో తన దగ్గరకు వచ్చిన దర్శకుడిని కూడా ఈ భామ వెనక్కు పంపినట్లు సమాచారం.

ఆ కధ వద్దని!
టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మధ్య కాలంలో ఒక లేడి ఓరియెంటెడ్ స్క్రిప్టుతో త్రిషను కలిశాడట. అయితే ఆమెకు సినిమా కధ పెద్దగా ఆసక్తి కలిగించక పోవడంతో చేయలేను అని తెగేసి చెప్పిందట. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











