త్రిష రిజెక్టు చేసిందని తెగ ఫీలై పోతున్న తెలుగు హీరో !?
సునీల్ హీరోగా దిల్ రాజు 'నెపోలియన్' అనే సినిమాను నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిమిత్తం హీరోయిన్ గా త్రిషను దిల్ రాజు సంప్రదించారు. అయితే ఆమె సునీల్ ప్రక్కన హీరోయిన్ గానా అని వెంటనే రిజెక్టు చేసిందిట. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తెగ ఫీలైపోతున్నాట్ట.తనను రాజమౌళి వంటి దర్శకుడు కూడా హీరోగా గూర్తించి సినిమా ఇచ్చారని, అలాంటిది త్రిష కాదనటం ఏమిటని అంటున్నారుట. అయితే పవన్ కల్యాణ్ ప్రక్కన చేసిన తను విచిత్రంగా సునీల్ ప్రక్కన చేయటానికి అడగటమేంటని త్రిష ఆశ్చర్యపడిపోతోందిట. ఇక ఈ చిత్రానికి రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన కోటి ఈ సినిమాకు దర్శకుడు. దాంతో ప్రస్తుతం మరో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడట దిల్ రాజు. అలాగే కధానాయకి ఫైనల్ అవగానే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. వచ్చే ఆగష్టు నెలలో సినిమా సెట్స్ ఫై కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











