ఇలియానాకి పవన్ కన్నా మహేషే ఎక్కువయ్యాడు
జల్సా కాంబినేషన్ పవన్ కళ్యాణ్, ఇలియానా ఖుషీగా చిత్రం (బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ రీమేక్)తో రిపీట్ అవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలియానాని తీసేసి ఆ ప్లేస్ లోకి త్రిషని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలియానా డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటమే దీనికి కారణమని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న త్రీ ఇడియట్స్ చిత్రానికి డేట్స్ భారీగా అడగటంతో ఈ నిర్ణయం తీసుకుందని, పవన్ కళ్యాణ్ కూడా దీనికి సరే అనటంతో నిర్మాత,దర్శకులు సైలెంట్ అయిపోయాని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రాన్ని జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిషతో పాటు 'బోణి' ఫేం కృతి కర్భందా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. బడే రవికుమార్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి ఆర్ట్: నారాయణ రెడ్డి, సినిమాటోగ్రఫి: జైనన్ విన్సెంట్, కొ-ప్రొడ్యూసర్: శివబాబు


Click it and Unblock the Notifications











