హీరోయిన్ త్రిషతో బాలయ్య రొమాన్స్?
హైదరాబాద్ : నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ.....ఫిల్మ్ నగర్లో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు బాలయ్యతో ఈ సినిమాలో చార్మి రొమాన్స్ చేయబోతోందనే వార్తలు వినిపించాయి. తాజాగా హీరోయిన్ త్రిష పేరు తెరపైకి వచ్చింది.
బోయపాటి ఇప్పటికే త్రిషకు స్క్రిప్టు వినిపించారని, ఆమె ఈ చిత్రంలో చేయడానికి సుముఖంగా ఉందని......త్రిష సన్నిహితులు అంటున్నారు. ఈచిత్రంలో ఇద్దరు హీరోయిన్ల చేస్తున్నారని, అందులో భాగంగానే త్రిషతో పాటు, చార్మిని తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలు ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
కాగా....ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభం అయింది. నెక్ట్స్ దుబాయ్‌లో షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక్కడ ఎడారిలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారాహి చలన చిత్రం సమర్పణలో 14రీల్స్ ఎంటర్టెన్మెంట్ పతాకంపై ఈచిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











