హాట్ టాపిక్: పోలీస్ ఆఫీసర్ తో త్రిష రొమాన్స్

By Srikanya

Trisha
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో త్రిష హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆ పాత్రలు ప్యాక్షన్ లీడర్,పోలీస్ అధికారి అని చెప్తున్నారు. పోలీస్ అధికారి పాత్రతో త్రిష రొమాన్స్ ఉంటుంది. ఈ రొమాంటిక్ సీన్స్ సినిమాలో హైలెట్ అవుతాయని చెప్తున్నారు. ఇక మరో పాత్ర ఫ్యాక్షన్ లీడరు కు కార్తిక తో రొమాన్స్ ఉంటుంది. అయితే ఆ సన్నివేశాలు చాలా పద్దతిగా ఉంటాయని,సింహాలో నయనతార తరహాలో ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి త్రిషే ఈ సినిమాలో సెక్స్ సింబల్ గా రొమాన్స్ పండిస్తుందని అంటున్నారు.

బోయపాటి ఈ చిత్రాన్ని పక్కా మాస్ మశాలా చిత్రంగా రూపొందిస్తున్నారు. సింహా కన్నా సూపర్ హిట్ కావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మధ్యనే త్రిష,ఎన్టీఆర్ ల మధ్య పీరియడ్ తరహాలో సెట్ వేయించి రామోజీ ఫిల్స్ సిటిలో సాంగ్ తీసారు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్‌ 'దమ్ము' చూపించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్‌ వినోదం మేళవించిన కథతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ తన మీసకట్టుని కూడా మార్చారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతోంది. అలెగ్జాండర్‌ వల్లభ నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X