త్రిషను..స్లట్(పతిత) అని తిట్టి అవమానం

By Srikanya

హైదరాబాద్ : త్రిష..ఫియాన్సి వరుణ్, త్రిష ల వ్యవహారం రోజు రోజుకూ ముదురుతూ షాక్ ఇస్తోంది. తాజాగా వరుణ్ ట్వీట్ చేస్తూ..పేరు ప్రస్తావించకుండా స్లట్ అన్నాడు. కాస్సేపటికే త్రిష అతన్ని ట్విట్టర్ లో అన్ ఫాలో అయ్యింది. దాంతో అందరూ ..వరుణ్ అన్నది త్రిషే అనే ఉద్దేశానికి వచ్చేసారు. కాకపోతే కాస్సేపటికి...స్లట్ అని పెట్టిన ట్వీట్ ని డిలేట్ చేసేసాడు. అయితే అప్పటికే జరగవలిసిన డామేజ్ జరిగిపోయింది. ఈ ట్వీట్ అన్ని మీడియాల్లోకి పాకేసింది. ఈ ట్విట్టర్ డ్రామా ఎన్నాళ్లు సాగుతుందో మరి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గత కొద్ది రోజులుగా త్రిష- వరుణ్‌ మణియన్‌ల పెళ్లి విషయం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పెళ్లికి ముందే అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు సిని,మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీరి సన్నిహితులు ముందుకు వచ్చి...వీరిని కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న అభిప్రాయ భేధాలు ఎవరి మధ్య అయినా సహజమేనని, సర్దుకుపోవాలని రాజీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

వరుణ్ మణియన్ ...రాజీకు ఇష్టపడినా, త్రిష మాత్రం పట్టుదలగా ఉందని అంటున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏం జరిగింది.. అప్పుడే ఎందుకు విడిపోయాలి అనే ఆలోచనకు అప్పుడే ఎందుకు వచ్చారనేది మాత్రం అర్దం కావటంలేదని అంటున్నారు. కానీ సన్నిహితులు మాత్రం...వీరిద్దరూ కలిసి ట్విట్టర్ ద్వారా కానీ ,మీడియా ద్వారా కానీ స్పందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారట.

Trisha's Fiance Called Slut?

త్రిష.. చిత్ర నిర్మాత వరుణ్‌ మణియన్‌తో ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం చెన్నైలో ఈ ఏడాది జనవరి 23న జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితులకు ఓ నక్షత్ర హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. ప్రస్తుతంఅంతేకాకుండా కొన్ని ప్రముక తమిళ పత్రికలు కూడా వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు ప్రచురించాయి.

ఇటీవల వరుణ్‌మణియన్‌ చెల్లెలు వివాహానికి కూడా త్రిష హాజరు కాలేదని, అంతేకాకుండా త్రిష తన చేతిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తీసేశారన్నది ఆ వార్తల సారాంశం. మరోవైపు వీరిద్దర్నీ కలిపేందుకు సన్నిహిత స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని స్పందించక పోవడం గమనార్హం.

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హవా చాటుకుంటున్న త్రిష.. ఇప్పటికీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఆమె నటించిన 'లయన్‌' త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలోనూ కొత్తగా రెండు చిత్రాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X