అనుష్కలో ఉన్నవి నాలో లేని అవే: త్రిష
మనం ఏ రంగంలో పనిచేస్తున్నామో.. ఆ ఫీల్డు గురించి బాగా తెలుసుకోవడం సహజం. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నవారికి ఆ రంగంపై పూర్తి అవగాహన ఉండటం అవసరమని పొడవుకాళ్ల సుందరి, సొట్ట బుగ్గల చిన్నది త్రిష అంటోంది. పక్కాహీరో సినిమా సక్సెస్ అయితే అది ఎందుకు సక్సెస్ అయిందో చూడటం పరిపాటే. అయితే అందరిని ఆకట్టుకునే విధంగా భారీస్థాయిలో సినిమా చేస్తే తప్పకుండా సక్సెస్ కాదా.. అంటూ త్రిష ప్రశ్నిస్తోంది.
హీరోయిన్ గా దాదాపు పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న త్రిష ఇంతదాకా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించలేదు. తన పేరుతో ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టే సత్తా త్రిష సొంతమైనా కానీ ఎందుకనో లేడీ సబ్జెక్టులకి దూరంగా ఉంటోంది. 'అరుంధతి" లాంటి సినిమాలు ఎందుకు చేయడం లేదని త్రిషని అడిగితే 'అనుష్క కాబట్టి ఆ పాత్రకి సరిపోయింది. ఆమె ఫిజిక్, ఫిగర్ ఆ పాత్రకి తగ్గట్టున్నాయి. కానీ నాకవి లేవు. అలాంటి పాత్రల్లో నన్ను ప్రేక్షకులు చూడలేరు. బహుశా కరుణరస పాత్రలైతే చేయగలనేమో అంటోంది త్రిష..
కనీసం పోలీస్ పాత్రలకి కూడా నేను సూట్ కాను. మీరు గమనించి ఉంటే ఇంతవరకు చేసిన సినిమాల్లోనూ నేను అలాంటివి పొరపాటున కూడా ట్రై చేయలేదు. నాకు నప్పని వాటిని చేసి నవ్వుల పాలు కావడం కంటే, ఇలా ఉండిపోవడమే బెటర్ కదా?అని త్రిష నిర్మొహమాటంగా చెప్పేసింది. తన బలాలు, బలహీనతల్ని ఇంత బాగా బేరీజు వేసుకుంది కాబట్టే త్రిష మిగతా హీరోయిన్ల కంటే ఎక్కువ కాలం అగ్ర పథాన కొనసాగగలిగింది. ఇప్పటికీ భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటోంది...


Click it and Unblock the Notifications











