twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతని తిట్టిన త్రిష

    By Staff
    |

    త్రిష పచ్చితాగుబోతు అన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన చెన్నై బీచ్ లో బాగా తాగి స్నేహితురాళ్లతో కలసి చేసిన హంగామా, పబ్ లో క్రికెటర్ బదానీతో తప్పతాగిన త్రిష గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు విన్న ఓ ప్రముఖ నిర్మాత త్రిషని ఎలాగైనా తన సినిమాలో నటింపజేయాలన్న తలంపుతో, తన సినిమాలో నటించమని అడగడానికి వెళ్లే ముందు ఓ విదేశీ బ్రాండ్ మద్యం బాటిల్ తీసుకెళ్లాడట. అది చూసిన త్రిష సదురు నిర్మాతపై మండిపడిందట. ఏమనుకున్నావు నా గురించి? నేనేమన్నా పచ్చి తాగుబోతుననుకన్నావా? అని విరుచుకుపడిందట. దీంతో ఆ నిర్మాత ఖంగుతిన్నాడట.

    ఇంతా చేసిన త్రిష చివరికి ఆ నిర్మాత నుండీ ఎంచక్కా మద్యం బాటిల్ తీసుకుని ర్యాక్ లో పెట్టుకుందట. దీంతో ఆ నిర్మాత మరో సారి ఖంగుతిన్నాడట. అంతే కాకుండా ఆ నిర్మత చిత్రానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. సో తిట్లయితే తిన్నాడు కానీ త్రిషని మాత్రం ఒప్పించగలిగాడు. అందుకే అన్నారు "ఆడవారి మాటలకు అర్థాలే వేరని"...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X