పెళ్లిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష: ముహూర్తం ఫిక్స్ చేసేసింది.. ఆ వ్యక్తితోనే ఏడు అడుగులు!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ త్రిష. కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను దక్కించుకున్న ఈ బ్యూటీ.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో దూసుకుపోయింది. కొద్ది రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైన ఆమె.. వేరే భాషల్లో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పెళ్లి విషయంలో త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

టీనేజ్‌లోనే ఆరంభం... ఎన్నో అవార్డులు

టీనేజ్‌లోనే ఆరంభం... ఎన్నో అవార్డులు

చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది తమిళ భామ త్రిష. ఓ వైపు చదువును పూర్తి చేస్తూనే మరోవైపు అందాల ప్రపంచంలో అదరగొట్టేసింది. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొంది. ఈ సమయంలోనే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుంది.

చిన్నప్పుడే యాక్టింగ్.. తెలుగులో అలా

చిన్నప్పుడే యాక్టింగ్.. తెలుగులో అలా

యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో త్రిష టీనేజ్‌లోనే 'జోడీ' అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన 'మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా నటించింది. అనంతరం 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. 'వర్షం'తో మొదటి బ్రేక్‌ను అందుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.

వరుణ్‌తో ప్రేమ.. నిశ్చితార్థం తర్వాత బ్రేక్

వరుణ్‌తో ప్రేమ.. నిశ్చితార్థం తర్వాత బ్రేక్

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ సమయంలో వరుణ్.. త్రిషను ఉద్దేశించి 'పతిత' అని ట్విట్టర్‌లో చేసిన పోస్టు అప్పట్లో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.

తెలుగు, తమిళ హీరోలతో డేటింగ్ అంటూ

తెలుగు, తమిళ హీరోలతో డేటింగ్ అంటూ

సుదీర్ఘమైన కెరీర్‌లో త్రిష చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తుందని అన్నారు. ఆ తర్వాత దగ్గుబాటి రానాతో డేటింగ్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. తెలుగు హీరోలే కాదు.. తమిళ పరిశ్రమకు చెందిన కొందరు స్టార్లతోనూ ఆమె లవ్ ట్రాకులు నడిపినట్లు టాక్ వినిపించింది.

ఇప్పుడు ఆ హీరోతో ప్రేమ... పెళ్లికి సిద్ధం

ఇప్పుడు ఆ హీరోతో ప్రేమ... పెళ్లికి సిద్ధం

అన్ని పరిశ్రమలకు చెందిన సీనియర్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహాలు చేసుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టి త్రిష పైనే పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరో శింబుతో త్రిష ప్రేమాయణం సాగిస్తుందని, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

పెళ్లి గురించి భిన్నంగా స్పందించిన త్రిష

పెళ్లి గురించి భిన్నంగా స్పందించిన త్రిష

కొద్ది రోజుల క్రితం త్రిష తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే తెలియదు. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను. నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా సినిమాలు నేను చేసుకుంటాను. అదే సమయంలో నాకు కాబోయే వాడి కోసం అన్వేషిస్తుంటాను. దీనికి త్వరలోనే ముగింపు పలుకుతాను' అంటూ చెప్పుకొచ్చింది.

Recommended Video

Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
పెళ్లిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష

పెళ్లిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష

పెళ్లి గురించి అడిగితే ఇన్ని రోజులూ ఏదేదో మాట్లాడింది త్రిష. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆమె వివాహానికి సిద్ధం అయిందట. ఈ సమ్మర్‌లోనే మూడు ముళ్లు వేయించుకోబోతుందని తెలుస్తోంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో కాదని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనను త్రిష చేయబోతుందని కోలీవుడ్‌లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X