ఆర్.ఆర్.మూవీ మేకర్స్ లో త్రిష
త్రిషను ఇప్పుడు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు తమ బ్యానర్ లో చెయ్యమని అడుగుతున్నారు. సునీల్ హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో త్రిష అయితే బావుంటుందని భావించి ఈ ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. త్రిష ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే త్రిషకు మాత్రం ప్రస్తుతం తెలుగులో పెద్ద డిమాండ్ ఏమీ లేదు. ఆమె వెంకటేష్ సరసన బాడీగార్డ్ చిత్రం మాత్రమే చేస్తోంది. తమిళంలో అజిత్ సరసన ఓ చిత్రం చేస్తోంది. ఆ రెండూ తప్ప ఆమెకు కొత్త ఆఫర్స్ లేకపోవటంతో ఈ చిత్రం ఒప్పుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడింది.
ఇక త్రిష ఒప్పుకుంటే క్రేజీ కాంబినేషన్ అవుతుందని దర్శకుడు బావిస్తున్నాడు. ఎమౌంట్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మేక్స్ ఇండియా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ దీనిని సమర్పిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ ఒకటిన హైదరాబాదులో ప్రారంభం అవుతుంది. వచ్చే జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా కామెడీగానే ఉంటుందని దర్శకుడు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











