త్రిషకు హైదరాబాద్ లో సొంత స్టార్ హోటల్?
త్వరలో అందాల తార త్రిష హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్ ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లు తెలుస్తోంది. త్రిష తండ్రి కృష్ణన్ ఇంతకు ముందు హోటల్ ఇండస్ట్రీతో అనుభందం ఉంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే త్రిష ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె శ్రేయాభిలాషులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ లోనే హోటల్ పెట్టడానికి కారణం ఆమెకు ఇక్కడ సినిమా వారితో ఉన్న రిలేషన్స్ అని తెలుస్తోంది. ఆమెకు ఇక్కడున్న ఓ హీరో పట్టుబట్టి మరీ ఈ వెంచర్ ని ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నాడు. ఆమె తన సొంత హోటల్ లో సినిమా వారికి ప్రత్యేక ఏర్పాట్లు అవీ చేస్తానని మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రస్తుతం త్రిష తెలుగులో వెంకటేష్ సరసన నమో వెంకటేశ చిత్రం చేసింది. అది సంక్రాంతికి రిలీజవనుంది. అలాగే హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా-మీటా చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. వీటితో పాటు తమిళంలో గౌతం మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం ఫినిష్ చేసింది. అదీ త్వరలో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











