పవన్ యాక్టింగ్ నభూతో నభవిష్యత్..అబ్బో సూపర్ టీజింగ్...!
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి, తనకు పవన్ తో చేయలేదనే లోటు లవ్ లీతో అవకాశం వచ్చినందకు గింగిరాలు తిరిగిపోయింది. చెన్నయ్ ముద్దుగుమ్మ త్రిష గతంలో ఎప్పుడూ లేనంతగా ఆమధ్య కాలంలో తన హీరోలను పొగడడం మొదలెట్టింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసే కార్యక్రమంలో వుంది. 'తీన్ మార్' సినిమాలో పవన్ నటన అద్భుతమే అద్భుతం అంటోంది. 'గతంలో 'బంగారం' సినిమాలో పవన్ తో ఒకే ఒక సీన్ చేశాను. ఇప్పుడిది ఫుల్ లెంత్ పాత్ర కదా...అతని నటన ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. ముఖ్యంగా యాక్షన్, టీజింగ్ సీన్లలో ఆయన నటన సుపర్బ్. తను టీజింగ్ సీన్స్ చేస్తుంటే అసలు నవ్వాపుకోలేకపోయాను. ఆయన టైమింగే టైమింగ్. అసలు అంత టైమింగ్ వున్న ఆర్టిస్టుని నేనింతవరకూ చూడలేదు" అంటూ చాలా 'అతి'గా మాట్లాడుతోంది. ఈమధ్య కమల హాసన్ తో 'మన్మధ బాణం' సినిమా చేసినప్పుడు కూడా కమల్ ని అలాగే పొగిడి పొగిడి వదిలింది. అయినా, హీరోయిన్లు హీరోలను ఎందుకు పొగుడుతారో మనకు తెలియందా?


Click it and Unblock the Notifications











