'ఊ.పె.కు.హ' త్రిష !!
తను నటించిన చిత్రాలకంటే ఈ మధ్య వివాదాలతోనే త్రిష వార్తల్లో వుంటోంది. మొన్న క్రికెటర్ బదానీతో గడవపడి, నిన్న ఓ నిర్మాతని తిట్టిపోసిన త్రిష టాక్ ఆఫ్ ద టౌన్ గా అందరి నోళ్లలో నానుతోంది. పార్టీలంటే పడిచచ్చే త్రిష తాను ఎంత బిజీగా వున్నా ఏ పార్టీనీ మిస్ అవదట. ఇటీవల చెన్నైలో జరిగిన రమ్యకృష్ణ బర్త్ డే పార్టీకి కూడా ఎంతో బిజీగా వున్నా రెక్కలు కట్టుకొని వాలిపోయిందట.
ఇక ఆ పార్టీలో త్రిష చేసిన హంగామా గురించి అక్కడున్న వాళ్లంతా "ఊ.పె.కు.హ" అన్నారట ముక్తకఠంతో. ఇంతకీ ఈ "ఊ.పె.కు.హ" ఏంటీ అనుకుంటున్నారా. ఆ మధ్యన జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీల కాంబినేషన్ లో వచ్చిన 'సందడే సందడి' చిత్రం చూసిన వారికి ఈ పాటికి అర్థమయింటుంది. చూడని వాళ్లు కోసం "ఊ.పె.కు.హ" అంటే "ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి" అని అర్థం. ఇంతకీ త్రిష అంత హడావిడి ఏం చేసింది అనుకుంటున్నారా?? ఏముందీ షరా మామూలే ఓ పుల్ బాటిల్ ఎత్తేసి తన స్టామినా ఏంటో రుచి చూపించింది.


Click it and Unblock the Notifications











