సర్‌ప్రైజ్: చిరంజీవి మూవీలో నలుగురు హీరోయిన్లు.. శ్రీలీలతో పాటు ఆ బ్యూటీలకూ లక్కీ ఛాన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే రూపొందుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రకటన సమయం నుంచే హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' ఒకటి. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మల్లిడి వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీ పంచభూతాలు కాన్సెప్టుతో విజువల్ వండర్‌గా రాబోతుంది. అందుకే ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు షెడ్యూళ్లను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

Trisha, Tamannaah, Sreeleela and Meenakshi Fix for Chiranjeevi Viswambhara Movie

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇప్పుడు జరుగుతోంది. ఇందులో హీరోతో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటుంది. దాదాపు పది రోజుల పాటు సాగే ఇందులో వీళ్లిద్దరిపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని తెలిసింది. అలా ఏమాత్రం బ్రేకులు లేకుండా షూటింగ్ జరపబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇందులో ఒకరు మెయిన్ హీరోయిన్ కాగా.. మిగిలిన వాళ్లు కీలక పాత్రలు చేస్తారని అన్నారు. ఈ క్రమంలోనే ఇందులో మెయిన్ లీడ్‌‌గా ఎంతో మంది పేర్లను పరిశీలించి త్రిషను తీసుకున్నారు.

Trisha, Tamannaah, Sreeleela and Meenakshi Fix for Chiranjeevi Viswambhara Movie

చిరంజీవి సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి తాజాగా సర్‌ప్రైజింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఆ పాత్రల కోసం తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరిలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే, ఈ ముగ్గురితో చిరంజీవి మామూలు కాంబో సీన్స్ మాత్రమే ఉంటాయని సమాచారం.

Trisha, Tamannaah, Sreeleela and Meenakshi Fix for Chiranjeevi Viswambhara Movie

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X