»   » కాబోయే భర్తకు దూరంగా ఉంటున్న త్రిష ... ఏమైంది?

కాబోయే భర్తకు దూరంగా ఉంటున్న త్రిష ... ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష తమిళ బిజినెస్‌మేన్ వరుణ్ ధావన్‌ను పెళ్లబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఆ మధ్య చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఎంగేజ్మెంట్ అనంతరం తన క్లోజ్ ఫ్రెండ్స్‌కి పార్టీ కూడా ఇచ్చింది ఈ భామ. అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి చాలా రోజులు అవుతున్నా...పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కడా వినిపించక పోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తోందనే వాదన వినిపిస్తోంది.

వరుణ్ తో ఎంగజ్మెంట్ తర్వాత త్రిషకు కలిసొస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత త్రిష ప్రొఫెషన్ పరంగా చాలా బిజీ అయిపోయింది. ఆమె నటించిన ఓ తమిళ సినిమా కూడా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా కొన్ని ప్రాజెక్టులకు సైన్ కూడా చేసింది త్రిష. అంతా బాగానే ఉన్నా....ఓ షాకింగ్ వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ మణియన్‌కు త్రిష దూరంగా ఉండేందుకు ట్రై చేస్తోందట.

Trisha Trying To Stay Away From Her Husband-To-Be?

ఈ నిర్ణయం త్రిష ఇటీవల తీసుకుందని అంటున్నారు. ఇటీవల వరుణ్‌‍కు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సినిమా ఆఫర్ కూడా ఆమె రిజెక్ట్ చేసినట్లు టాక్. వరుణ్ సంస్థకు సంబంధించిన సినిమా తిరస్కరించి....తన మేనేజర్ గిరి తెచ్చిన ఓ కామెడీ హారర్ ప్రాజెక్టుకు సైన్ చేసిందట.

ఇలాంటివి సినిమా ప్రొఫెషన్లో సర్వ సాధారణమే అయినా...... పుకార్లకు కాదేదీ అనర్హం అన్నట్లు ఈ విషయాలను బేస్ చేసుకుని త్రిష, వరుణ్ మణియన్ సంబంధం గురించి రకరాల వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్-త్రిష మ్యారేజ్ డేట్ ఫిక్సయితే తప్ప ఈ వార్తలకు తెరపడే అవకాశం లేదు.

English summary
Trisha's engagement with the business man, Varun Manian, was a grand gala event and the couple has also given a lavish party to their close circles from all the film industries. However, there is still no news about their marriage date.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu