Trisha: 39 ఏళ్ల హీరోకి తల్లిగా 40 ఏళ్ల త్రిష.. ఏందయ్యా ఇదీ?
హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి.. దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ.. ఇప్పటికే అదే అందం. అంతే కాదు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈమె గురించి ఓన్యూస్ వైరల్ గా మారింది. 40ఏళ్ల వయసు ఉన్న త్రిష.. 39ఏళ్ల వ్యక్తికి తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
హీరోయిన్ త్రిష... ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా... నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక నేటి తరం హీరోయిన్స్ కు పోటీగా చేస్తూనే...స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. చిన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష... ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టింది. స్టార్ హీరోలందరితో కలిసి నటించి సౌత్ లోనే నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా అవతరించింది .

త్రిషతో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయారు. ఈ రెండు దశాబ్దాల ఆమె కెరీర్ లో ఎంతోమంది కుర్ర హీరోయిన్లు వచ్చారు... పోయారు కానీ త్రిష మాత్రం అలాగే ఉంది. 40 ఏళ్ల వయస్సు లో కూడా ఇలాంటి స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చెయ్యడం ఎవరి వల్ల కాదు. అయితే ఇప్పుడు ఈ భామ గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరోయిన్ త్రిష ఓ యంగ్ హీరోకు తల్లిగా నటించబోతుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, త్రిష ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదట కొడుకు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారు. కానీ ఆయన ఈసినిమాకు నో చెప్పడంతో.. ఆ ఛాన్స్ శర్వానంద్ కు వరించింది. అయితే శర్వానంద్... త్రిషకు కొడుకు పాత్రలో నటించనున్నారు.

అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా... త్రిష వయసు 40. ఇక శర్వానంద్ వయసు 39. దీనితో 40 ఏళ్ల తల్లికి 39 ఏళ్ల కొడుకు పాత్రలో శర్వానంద్ నటించనున్నారు. దీనితో నెటిజన్స్ అవాక్ అవుతున్నారు. ఇదేం కాంబినేషన్ రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇదీలా ఉండగా.. గతంలో జయసుధకు కొడుగ్గా వెంకటేషన్ నటించినప్పుడు కూడా ఇలాగే కామెంట్స్ వచ్చాయి. వారి మధ్య ఏజ్ గ్యాప్ రెండేళ్లే ఉండటం విశేషం.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా మలయాళం మూవీ బ్రో డాడీకి రీమేక్ అని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం త్రిష... లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న లియో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ అక్టోబర్ లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











