త్రిషా కవ్విస్తున్నా..హీరోలు కనికరించట్లేదు..ఇది టూ మచ్
త్రిష గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తుంటుంది. ఆ వార్త కేవలం వదంతి మాత్రమేనని త్రి ఖండించడం కూడా తెలుసు. తాజాగా త్రిష గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. ఒక సినిమాలో తను వదినగా యాక్ట్ చేయబోతోందనే వార్త అది. ఈ వార్త విన్న త్రిష తెగ ఫీలై పోతోంది. ఇది టూ మచ్. వదిన పాత్రలు చేయాల్సిన ఖర్మ నాకేంటి? ఇంకా నాకా వయసు రాలేదు. హీరోయిన్ గా బిజీబిజీగా ఉన్నాను అలాంటప్పుడు వదిన పాత్ర ఎందుకు ఒప్పుకుంటాను అని అంటోంది.
హీరోయిన్ త్రిషకు ముప్పై ఏళ్లొచ్చినా... ఇంకా నాకు ఇరవై అన్నట్టుగా బిల్టప్పులిస్తోంది. తన మేకప్, కాస్ట్యూమ్స్ మార్చేసి వయస్సు తక్కువ చేసి చూపేందుకు తెగ ట్రై చేస్తోంది. పాపం ఏం చేసినా... కుర్ర హీరోలు మాత్రం త్రిషా వైపు కన్నెత్తైనా చూడట్లేదట పాపం.
కొత్త హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేస్తుంటే... సీనియర్ హీరోయిన్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఎంతమందొచ్చినా త్రిష లాంటి హీరోయిన్స్ మాత్రం ఏదో రకంగా పోటీనీ తట్టుకొని నిలబడుతుంటారు. అయితే వారి పోటీని తట్టుకోవడానికి యంగ్ గా కనిపించేందుకు రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు. ఇప్పుడు త్రిషా అలాంటి పాట్లే పడుతోంది. ముప్పై ఏళ్ల త్రిషాను ఆల్రెడీ ఆంటీగా లెక్క కట్టేశారు.
సీనియర్ హీరోలతో మాత్రమే నటిస్తోన్న త్రిష... కుర్ర హీరోల్ని ఎట్రాక్ట్ చేసేందుకు... స్కెచ్చులేస్తోంది. తాను ఇంకా యూతే అని ప్రూవ్ చేసుకునేందుకు మేకప్, కాస్ట్యూమ్స్ ని కంప్లీట్ గా మార్చేసింది. తన వయస్సు ఎక్కవ అనే ఫీలింగ్ రాకుండా కవర్ చేసేందుకు కష్టపడుతోంది. అయితే ఎంత కష్టపడుతున్నా... సీనియర్స్ తప్ప... జూనియర్స్ ఆమె వైపు కన్నెత్తి చూడట్లేదని తెగ ఫీలవుతోందట. తన కష్టం ఊరికేపోదన్నట్టు... తన ప్రయత్నాలు మాత్రం ఆపనంటోంది.


Click it and Unblock the Notifications











