పవన్ కళ్యాణ్ ఇలియానాకి ఇచ్చినట్టే నాకు ఇస్తే భాగుండు: త్రిష
ఎలాగైనా ఇప్పటి యువ హీరోయిన్లకి పోటీ ఇవ్వాలని త్రిష పాపం గతంలో కంటే ఎక్కువ కసరత్తు చేస్తోంది. అయినా కానీ త్రిషకి నలభై లేదా యాబై దాటిన హీరోలతోనే అవకాశాలొస్తున్నాయి. కనీసం ఈ జోన్ లో అయినా సేఫ్ గా మరి కొన్నేళ్లు జర్నీ చేయాలని త్రిష కోరుకుంటోంది. రీసెంట్ గా కమల్ హాసన్ వేసిన 'మన్మథబాణం" త్రిషకి అటు తమిళంలో, ఇటు తెలుగునాట కూడా రెండు హోల్స్ చేసి పారేయడంతో ఇప్పడు ఆమె ఆశలన్నీపవన్ కళ్యాణ్ మీదకి మళ్లాయి.
పవన్ తనకో 'లవ్ లీ" హిట్ ఇచ్చి ఆదుకుంటాడని త్రిష ఆశిస్తోంది. ఇలియానా కెరీర్ ఆల్ మోస్ట్ ముగిసిందనే దశలో 'జల్సా"తో మళ్లీ ఆమెకి ఊపు తెచ్చాడు కాబట్టి తనకీ అలానే ఊపిరి పోస్తాడని త్రిష భావిస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా ముంచేస్తే మాత్రం త్రిష ఇక తెలుగు నుంచి దాదాపుగా నిష్క్ర్రమిస్తుంది. అలాగే తమిళంలో ఫార్టీ ప్లస్ హీరో అజిత్ తో చేస్తున్న 'మంకత" మీద కూడా త్రిషకి గంపెడాశ ఉంది. నయనతారని 'బిల్లా"తో స్టార్ ని చేసిన అజిత్ తన స్టార్ డమ్ నిలిపే విజయాన్నిస్తాడని త్రిష కోరుకుంటోంది. సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమాలు త్రిషకి సమ్మగా అనిపిస్తాయో, హాట్ గా మారతయో చూడాలి.


Click it and Unblock the Notifications











