ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ కొత్త జోనర్.. కథలో సాహస వీరుడిగా తారక్.. హీరోయిన్ ఎవరంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఎక్కువగా ఫ్యామిలీ జోనర్ కథలే గుర్తుకు వస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్, పదునైన మాటలు ఎన్ని ఉన్నా కూడా ఎదో ఒక విధంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లోనే కథను నడుపుతుంటారు. ఇక మొదటిసారి త్రివిక్రమ్ ఒక సరికొత్త జోనర్ ని టచ్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. నెక్స్ట్ సినిమాలో తారక్ ని సాహస వీరుడిగా చూపించబోతున్నాడట. దాదాపు హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Recommended Video

9 Reasons For Jr NTR Enormous Craze | Happy Birthday NTR
 ఎందుకని జోనర్ ని మార్చడం లేదు..?

ఎందుకని జోనర్ ని మార్చడం లేదు..?

రచయితగా కెరీర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా మనుషుల విలువలకు సంబంధించిన జోనర్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. మాటలతోనే సినిమాపై అంచనాలు పెంచగల త్రివిక్రమ్ ఎందుకని జోనర్ ని మార్చడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇతర స్టార్ దర్శకులు ఎప్పటికప్పుడు వారి శైలిని మారుస్తున్నారు.

 ఆయన పెన్నుకు ఉన్న బలం

ఆయన పెన్నుకు ఉన్న బలం

జోనర్ ని మార్చకపోయినా కూడా త్రివిక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ దక్కుతోంది. అల..వైకుంఠపురములో దాదాపు 150కోట్ల షేర్స్ ని అందించింది అంటే ఆయన పెన్నుకు ఉన్న బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే త్రివిక్రమ్ గనక కాస్త డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేస్తే ఆ సినిమాలకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు.

త్రివిక్రమ్ అడ్వెంచర్ సినిమా..

త్రివిక్రమ్ అడ్వెంచర్ సినిమా..

ఇక నెక్స్ట్ ఈ స్టార్ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా త్రివిక్రమ్ అడ్వెంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు మొదటి నుంచి ఒక రూమర్ వస్తోంది. ఆ రూమర్ అబద్ధమని ఇంతవరకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్టీఆర్ సాహస వీరుడిగా

ఎన్టీఆర్ సాహస వీరుడిగా

ఇక జూనియర్ ఎన్టీఆర్ సాహస వీరుడిగా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. RRR తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కాబట్టి మినిమమ్ కొత్తగా ఉండాలి. అలాగే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. దీంతో త్రివిక్రమ్ హార్డ్ వర్క్ చేయక తప్పదు.

 జాన్వీ కపూర్ హీరోయిన్ గా..

జాన్వీ కపూర్ హీరోయిన్ గా..

హీరోయిన్ విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. మళ్ళీ పూజా హెగ్డే తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఆ తరువాత కీయరా అద్వానీ అంటూ ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఇక ఫైనల్ గా ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X