twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ ఫాన్స్‌కు పండగే.. న్యూ ఇయర్ నైట్ త్రివిక్రమ్ అదిరిపోయే గిఫ్ట్!

    |

    ఈ ఏడాది మేలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య అంటూ అభిమానులని పలకరించాడు. వక్కంతం వంశి రూపొందించిన ఆ చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. అప్పటినుంచి ఇంతవరకు అల్లు అర్జున్ కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. బన్నీ కొత్త చిత్రం విషయంలో ఎన్నెన్నో వార్తలు వస్తున్నా ఏది ఖరారు కాలేదు. కానీ బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ సిద్ధం అవుతోందని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర ప్రకటన కోసం బన్నీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడట.

    కథ సిద్ధం

    కథ సిద్ధం

    తాజాగా ఇండస్ట్రీ వార్తగాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పవర్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ కథని బన్నీ కోసం సిద్ధం చేశాడట. అల్లు అర్జున్ కూడా కథ అదరిపోయిందని త్రివిక్రమ్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీకి తుది మెరుగులు దిడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    న్యూ ఇయర్ నైట్

    న్యూ ఇయర్ నైట్

    బన్నీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ న్యూ ఇయర్ నైట్ సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రకటనతో పాటు నేరుగా టైటిల్ లోగో కూడా విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి చివర్లో షూటింగ్ మొదలు పెట్టి దసరాకు విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా చెబుతున్నారు.

     అరవిందతో జోష్

    అరవిందతో జోష్

    ఈ ఏడాది ఆరంభంలో అజ్ఞాతవాసి చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో రాయలసీమ ఫ్యాక్షన్ కథని తనదైన శైలిలో త్రివిక్రమ్ చూపించారు. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి సబ్జెక్టు ఎంచుకున్నాడనేది సస్పెన్స్. కానీ ఏ చిత్రంలో యువతకు నచ్చే అంశాలు బలంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

    తిరుగులేని కాంబినేషన్

    తిరుగులేని కాంబినేషన్

    అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయం అందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ మూవీ కోసం త్రివిక్రమ్ కాస్టింగ్ ని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని కూడా హారిక అండ్ హాసిని బ్యానర్ లోనే చేస్తారా లేక నిర్మాతలని మారుస్తారా అనేది చూడాలి.

    English summary
    Trivikram and Allu Arjun to announce their new project for new year. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X