పవన్ మాయలో త్రివిక్రమ్, బన్నీకి ఝలక్ ఇచ్చినట్లేనా?
హైదరాబాద్: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం ప్రారంభోత్సవం కూడా లాంచనంగా జరిగింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుపై షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఇపుడప్పుడు పట్టాలెక్కే పరిస్థితి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టును విషయాలను పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'గోపాలా గోపాలా' సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో బిజీ అయిపోయాడట. దీంతో పాటు మరో వైపు మహేష్ బాబు కోసం కూడా స్టోరీలు రెడీ చేసుకుంటున్నాడట. ఇప్పటికే కొన్ని స్టోరీలు మహేష్ బాబుకు వినిపించాడట కూడా.
ఈ పరిణామాల నేపథ్యంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా చాలా లేటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న అల్లు అర్జున్ కూడా టైం వేస్ట్ చేయకుండా ఇతర సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

త్రివిక్రమ్ ఎందుకిలా చేస్తున్నారు?
పవన్ కళ్యాణ్ ‘గోపాలా గోపాలా' సినిమాకు స్క్రిప్టు రెడీ చేయాల్సిన పరిస్థితి రావడంతో బన్నీతో చేయాల్సిన ప్రాజెక్టును త్రివిక్రమ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు కోసం కూడా...
దీంతో పాటు మహేష్ బాబు కోసం కూడా ఓ సినిమా కథను రెడీ చేస్తున్నాడు త్రివిక్రమ్.

నిర్మాతల అనుమతి కూడా ఉంది
పవన్ కళ్యాణ్ ‘గోపాలా గోపాలా' చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్రివిక్రమ్-బన్నీ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రెండు నిర్మాణ సంస్థల మధ్య పరస్పర సంబంధాలు ఉండటంతో తివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తున్నారని తెలుస్తోంది.

బన్నీ ప్రాజెక్టు మళ్లీ ఎప్పుడు?
‘గోపాలా గోపాలా' సినిమాకు సంబంధించిన పని పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ బిజీ బిజీగా గడుపనున్నారు. ఆ తర్వాతే బన్నీతో చేసే ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు.

వేరే ప్రాజెక్టుల వైపు చూస్తున్న బన్నీ
ఈ పరిణామాల నేపథ్యంలో బన్నీ కూడా ఇతర ప్రాజెక్టులు వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా సుకుమార్‌ను పిలిచి కథ రెడీ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











