పవన్ కోసం మరోసారి రంగంలోకి త్రివిక్రమ్: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం
సాధారణంగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ చాలా నెమ్మదిగానే సినిమాలు చేస్తోన్నారు. దీంతో ఏడాదికి ఒక సినిమా వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకకాలంలోనే మూడు నాలుగు సినిమాలను ప్రకటించడంతో పాటు వరుసగా ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ వస్తోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాల్లోకి రీఎట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో కనిపిస్తోన్న ఈ మెగా హీరో.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే, ఇప్పుడు వరుస పెట్టి కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకెళ్తోన్నాడు.
ఇప్పటికే ఎన్నో చిత్రాలను మొదలు పెట్టి కెరీర పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే.. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన 'వినోదయ సీతమ్' రీమేక్. దీనికి ప్రముఖ డైరెక్టర్, నటుడు సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఊహించని న్యూస్ లీకైంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వినోదయ సీతమ్' రీమేక్ మూవీకి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారట. తమిళ చిత్రం కావడంతో దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఆయన మార్పులు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఇందులో పవన్ పాత్ర నిడివిని పెంచడంతో పాటు కొన్ని ఎలివేషన్ సీన్స్‌ను కూడా సూచించాడని అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా రాయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా హాట్ టాపిక్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వినోదయ సీతమ్' రీమేక్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 14వ తేదీన జరగబోతున్నాయని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక, ఇందులో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











