బన్నీ కంటే త్రివిక్రమ్‌కే ఎక్కువ రెమ్యూనరేషన్
హైదరాబాద్: ‘జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నసంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఈచిత్రం కోసం త్రివిక్రమ్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది. రూ. 12 కోట్ల రెమ్యూరేషన్‌తో పాటు 25 శాతం టేబుల్ ప్రాఫిట్ తీసుకుంటున్నాడట త్రివిక్రమ్. అంటే ఈమొత్తం దాదాపుగా 15 నుండి 18 కోట్లు ఉండొచ్చని అంటున్నారు. అయితే బన్నీ రెమ్యూనరేషన్ రూ. 8 కోట్ల లోపే ఉంటుందని అంచనా.
ఇప్పటి వరకు టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ దర్శకుడు రాజమౌళి(రూ. 20 కోట్లు) తీసుకుంటున్నాడని టాక్. దీన్ని బట్టి త్రివిక్రమ్ రెండో స్థానంలో ఉన్నారనే అంటున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్...విషయంలో తనదైన ప్రత్యేకత చాటుతున్న త్రివిక్రమ్ తన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న తాజా సినిమా విశేషాల్లోకి వెళితే....ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. సెప్టెంబర్ 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











