మహేశ్ - త్రివిక్రమ్ మూవీ నుంచి ఊహించని న్యూస్: ఈ సారి అలాంటి కథతో.. అదిరిపోయే పాత్రలో సూపర్ స్టార్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సినిమాలు హిట్లు అయినా.. ఫ్లాప్ అయినా కొంత మంది కలయికలో వస్తే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతుంటాయి. ఇలా.. చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న కాంబినేషన్‌లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి. తాజాగా వీళ్లిద్దరి కాంబోలో సినిమా రాబోతున్న ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

మహేశ్ బాబు అలా.. త్రివిక్రమ్ ఇలా

మహేశ్ బాబు అలా.. త్రివిక్రమ్ ఇలా

కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. ప్రస్తుతం పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో కరోనా రూపంలో షూటింగ్‌కు బ్రేకులు పడిపోయాయి. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమా ఇండస్ట్రీ హిట్‌ను కొట్టాడు.

ఎన్టీఆర్‌తో మిస్.. మహేశ్‌తో మూవీ

ఎన్టీఆర్‌తో మిస్.. మహేశ్‌తో మూవీ

వాస్తవానికి 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్ తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఇది కొద్ది రోజుల్లో పట్టాలెక్కుతుందనగా ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి త్రివిక్రమ్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

అధికారికంగా ప్రకటించిన యూనిట్

అధికారికంగా ప్రకటించిన యూనిట్

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ శనివారం సాయంత్రమే ఓ వీడియోను సైతం విడుదల చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన సమయంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు.

 వాళ్లకు పోటీగా వచ్చేందుకు సిద్ధం

వాళ్లకు పోటీగా వచ్చేందుకు సిద్ధం

మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చేయబోయే సినిమాను ప్రకటించిన సమయంలోనే.. అది ఎప్పుడు విడుదల కాబోతుంది అనే దానిపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. అదే సమయంలో ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'సలార్'తో పాటు ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో వస్తున్న చిత్రం రిలీజ్ కానున్నాయి.

ఈ సారి అలాంటి కథతో వస్తున్నారు

'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో వస్తున్న ఈ సినిమాను పక్కా మాస్ మసాలా కథతో రూపొందించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. మొత్తం కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. దీనికి భారీ బడ్జెట్ కేటాయించారని టాక్.

అదిరిపోయే పాత్రలో సూపర్ స్టార్

అదిరిపోయే పాత్రలో సూపర్ స్టార్

త్రివిక్రమ్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందట. ఇప్పటి వరకూ అతడు చేయని, కనిపించని రోల్‌ను మాటల మాంత్రికుడు సిద్ధం చేశాడని అంటున్నారు. అలాగే, ఇందులో సూపర్ స్టార్ గెటప్ కూడా అదిరిపోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకమైన మేనరిజంతో హీరోను బాగా ఎలివేట్ చేయబోతున్నాడని కూడా ఓ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X