తలనొప్పి తగ్గించే పనిలో కూడా త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు...
మూడేళ్ల నుంచి మహేష్ సినిమా ఏదీ రానందున 'ఖలేజా'ను చూసేందుకు అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంలో మహేష్ తనకు ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అమృతాంజనం యాడ్ చేయబోతున్నారు.జూలై 23 నుంచి 25వ తేదీ దాకా దీనికి సంభందించిన యాడ్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ యాడ్ ని ఖలేజాకి ప్రమోగా వాడనున్నారు. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ తో కలిసి ధమ్స్ అప్ యాడ్ చేసారు. అదీ ఖలేజా ప్రమోషన్ లో భాగంగానే చేసాము అంటున్నారు. త్వరలో ఈ రెండు యాడ్ లు టీవీల్లో వస్తాయి. ఇప్పటికే మహేష్ బాబు...నవరత్న ఆయిల్, థమ్సప్,యూనివర్సల్ సెల్, థమ్సప్, యూనివర్సల్ సెల్, ప్రోవోగ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వాటితో పాటు ఇప్పుడు అమృతాంజనం కుడా వాటితో కొత్తగా వచ్చి చేరింది. సినిమా సంగతి ఎలా ఉన్నా యాడ్ లుకు మాత్రం మహేష్ లోటు రానివ్వటం లేదు.
మహేష్ బాబు ఖలేజా అనుష్క త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు mahesh babu khaleja anushka trivikram srinivas athadu


Click it and Unblock the Notifications