SSMB 28: త్రివిక్రమ్ లిస్టులో ఉన్నది నాని కాదు.. ఆ హీరోనే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం మరో యువ హీరోను సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అల వైకుంఠ పురములో సినిమా లో ఎలాగైతే అక్కినేని వారి మేనల్లుడు సుశాంత్ ను హైలెట్ చేశాడో ఇప్పుడు కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కథకు చాలా అవసరమైన పాత్ర కోసం ఇప్పటికే కొంత మందిని సంప్రదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇంకా ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.మొన్నటి వరకు అయితే నేచురల్ స్టార్ నాని పేరు గట్టిగానే వినిపించింది. త్రివిక్రమ్ నాని సినిమాలో నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిజానికి కొన్నేళ్ళ క్రితం త్రివిక్రమ్ నానితో ఒక చిన్న సినిమా చేయాలని అనుకున్నాడు.

trivikram focus on another hero for mahesh babu upcoming project

కానీ ఎందుకో ప్రణాళికలు వర్కౌట్ కాలేదు. అయితే ఇటీవల మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నానిని సంప్రదించినట్లు టాక్ అయితే వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ ఎప్పటిలానే సుశాంత్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అల వైకుంఠ పురం సినిమా లో సింపుల్ పాత్రలో కనిపించిన సుశాంత్ అయితే తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే ఆ సినిమా సక్సెస్ అతని కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు తో షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో హీరోకు సోదరుడి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X