»   »  బన్నీ మూవీ ఫంక్షన్‌కు గెస్టులుగా పవన్-మహేష్?

బన్నీ మూవీ ఫంక్షన్‌కు గెస్టులుగా పవన్-మహేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నా ఆప్ సత్యమూర్తి' మూవీ ఆడియో మార్చి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గెస్టులుగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్స్ త్రివిక్రమ్ కు చాలా క్లోజ్ కావడంతో వీరిని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Trivikram has invited Mahesh Babu and Pawan Kalyan?

ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. జులాయి తర్వాత బన్నీతో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
If the reports are to be believed, Trivikram has invited both the Mahesh Babu and Pawan Kalyan to attend the audio launch of his upcoming movie, 'Son of Satya Murthy' with Allu Arjun.
Please Wait while comments are loading...