మహేష్ బాబుకి రెండెళ్ళు పట్టింది మరి పవన్ కళ్యాణ్ కో....
గత రెండేళ్ళుగా షూటింగ్ చేస్తూనే వచ్చి విమర్శల పాలైన త్రివిక్రమ్ 'ఖుషీగా" చిత్రానికి కేవలం రెండు నెలల్లోనే టోటల్ స్ర్కిప్ట్ రెడీ చేసి ఇచ్చేశారనే న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. నిజానికి తను దర్శకుడిగా మారాక బయటి సినిమాలకి స్ర్కిప్ట్ లివ్వడం మానుకున్న త్రివిక్రమ్ 'ఖుషీగా" సినిమా కోసం మళ్ళీ రచయితగా మారింది కేవలం పవన్ కళ్యాణ్ కోసమేనట. 'జల్సా" టైమ్ లో పవన్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోరిక మేరకే 'లవ్ ఆజ్ కల్ " కి తెలుగు కి తగ్గ మెరుగులద్దే ప్రయత్నం చేపట్టారనీ, మరెవ్వరూ చెయ్యలేని చక్కని మార్సులతో ఆ స్ర్కిప్ట్ ని అత్యద్భుతంగా మలిచారనీ ప్రశంసలు కురిపిస్తున్నారు 'ఖుషీగా " యూనిట్ మెంబర్స్.
అంతే కాదు, కేవలం రెండు నెలల్లోనే స్ర్కిప్ట్ ని బౌండ్ బుక్ చేసి ఇచ్చేసిన త్రివిక్రమ్ ప్రతి సీన్ కీ తన విజువలైజేషన్ ని యాడ్ చేసి జయంత్ కి కంటిన్యూ చెయ్యగలిగితే..రైటింగ్ లోనే కాకుండా షూటింగ్ లోనూ ఈ వేగం చూపగలిగితే..దసరాకి వెంకటేష్ తో స్టార్ట్ చేస్తోన్న ఆయన తాజా చిత్రం 2011 వేసవి సెలవులకు సందడి చేయడం ఖాయం..!


Click it and Unblock the Notifications











