పూజపాపను వదలని త్రివిక్రమ్.. గుంటూరు కారం కోసం అలా వాడేస్తున్నాడుగా!
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైరెక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేశ్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకోగా.. పలు కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ భామకు అడ్వాన్స్ చెల్లిండంతో.. త్రివిక్రమ్ ఈ భామను అలా వాడేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....
అలా ఇండస్ట్రీలోకి అడుగు...:త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆయన సినిమాల్లో డైలాగ్స్, ఎమోషన్స్, సెంటిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. డైలాగ్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే నువ్వే సినిమాతో మెగా ఫోన్ పట్టి దర్శకుడు అయ్యాడు. అక్కడి నుంచి ఆయన వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలతో సినిమాలు తీసే అవకాశం, ఆఫర్లు వచ్చాయి. ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

కాంబినేషన్ హిట్టు:అయితే త్రివిక్రమ్ పూజా హెగ్డే సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీర రాఘవ.. సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. త్రివిక్రమ్ కు పూజా పాప లక్కీ హీరోయిన్ గా మారిందని అంతా అంటున్నారు. ఇక త్రివిక్రమ్ గుంటూరు కారంలో పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా తీసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ... పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

పూజా అవుట్...:ఇక పూజా తప్పుకోవడంతో... సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ప్రకటించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకుంటున్న తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు ఆది నుంచి అవంతరాలే ఏర్పాడ్డాయి. పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో... ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అలా వాడేస్తున్నాడుగా...: ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే... త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కోసం పూజా హెగ్డేకు నిర్మాతలు ముందే అడ్వాన్స్ చెల్లించారట. కానీ కొన్ని కారణాలతో పూజా తప్పుకుంది. దానితో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ కోసం వాడనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పూజ పాపను త్రివిక్రమ్ ఇలా వాడేస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే...:ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.


Click it and Unblock the Notifications











