త్రివిక్రమ్ కోపంతో అరిచాడు: ప్రణీత వెళ్లిపోయింది

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో మొదట ప్రణీత ని తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఆమె వెళ్లిపోయి ఆమె ప్లేస్ లోకి నిత్యామీనన్ వచ్చి చేరింది. దీనికి కారణాలు రకరకాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. అయితే తాజాగా వినపడుతున్న ప్రకారం సెట్స్ లో త్రివిక్రమ్ కోపంతో మండిపడ్డారట. దాంతో అవమానంగా ఫీలైన ప్రణీత వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఈ విషయమై పాపులర్ ఇంగ్లీష్ డైలీ సైతం రాసుకొచ్చింది.

త్రివిక్రమ్ ఓ ప్రత్యేకమైన సన్నివేశంలో ఆమె ఫలానా రకంగా బిహేవ్ చేయాలని, అప్పుడు వేసుకోవాల్సిన ఆ డ్రస్ ను ఆమెకు వివరించాడట.అయితే ప్రణీత దాన్ని సీరియస్ గా తీసుకోకుండా సెట్స్ మీదకు రెడీ అయ్యి వచ్చేసిందిట. దాంతో త్రివిక్రమ్ కి మండి, చాలా సీరియస్ అయ్యారట. దాంతో ఆయన అరిచారుట. యూనిట్ లో అందరి ఎదురుగా ఇది జరగటంతో ప్రణీత ఇది అవమానంగా ఫీలై వేరేవారిని చూసుకోమని పేకప్ చెప్పి వెళ్లిపోయిందిట. అప్పుడు నిత్యామీనన్ ని సీన్ లోకి తీసుకుని వచ్చారని తెలుస్తోంది.

Trivikram loses cool; Pranitha walks out

'జులాయి' వంటి విజయవంతమైన సినిమాను అందించిన దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఈ సినిమా రూపొందుతూండటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ రెండవ షెడ్యూల్‌ను దసరా తర్వాత ఊటిలో జరపనున్నారు. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను అక్కడి షెడ్యూల్‌లో త్రివిక్రమ్‌ చిత్రీకరిస్తారు.

ఇందులో అల్లు అర్జున్‌తోపాటు హీరోయిన్లు సమంతా, అదా శర్మ, ఉపేంద్ర, స్నేహ కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అయితే ఈ చిత్రంలో ఉపేంద్ర కథను మలుపుతిప్పే కీలకమైన క్యారెక్టర్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికాలంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X