ప్లాప్ ఎఫెక్ట్: త్రివిక్రమ్ పేరు లేపేసిన వైనం, నితిన్ చర్యపై ఫ్యాన్స్ షాక్!
Recommended Video

సినిమా ఇండస్ట్రీలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. చేతిలో సక్సెస్ ఉన్నప్పుడు, తమ చేతి నుండి సక్సెస్ చేజారిన తర్వాత పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక స్టార్ హీరోలతో సినిమా చేసి ఇండస్ట్రీలో చరిత్రలోనే అతిపెద్ద ప్లాప్ పడితే మాత్రం దర్శకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల, శ్రీను వైట్ల లాంటి దర్శకులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

త్రివిక్రమ్ మీద అజ్ఞాతవాసి ఎఫెక్ట్
తాజాగా పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి' లాంటి భారీ డిజాస్టర్ తీసిన దర్శకుడు త్రివిక్రమ్ గతంలో కంటే చాలా భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ పడ్డ నిర్మాతలు ఇపుడు వీలైనంత దూరంగా ఉంటున్నారట.

ఆ సినిమా నుండి త్రివిక్రమ్ పేరు లేపేసిన వైనం
కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కలిసి నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాణంలో నితిన్ సొంత బేనర్‍తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ కూడా భాగస్వామిగా ఉంది. అయితే ఈ సినిమా నుండి త్రివిక్రమ్ పేరు లేపేపయడం హాట్ టాపిక్ అయింది.

కథ అందించిన త్రివిక్రమ్
ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ కథ అందించినట్లు అప్పట్లో సినిమా ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 5 ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందులో త్రివిక్రమ్ పేరు లేక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్లాప్ ఎఫెక్టేనా?
‘అజ్ఞాతవాసి' సినిమా పరాజయంతో త్రివిక్రమ్ ఇమేజ్ డౌన్ కావడంతో..... అతడి పేరును తమ సినిమాకు వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అనే ఉద్దేశ్యంతో ఈ పేరును తొలగించినట్లు భావిస్తున్నారు.

నితిన్ చర్యతో అభిమానులు షాక్
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ ‘అ..ఆ' సినిమా కూడా చేశాడు. కానీ అవన్నీ మరిచి కేవలం త్రివిక్రమ్ ఇమేజ్ డౌన్ అయిందనే ఉద్దేశ్యంతో నితిన్ అతడి పేరును తొలగించాలనే నిర్ణయం తీసుకోవడం..... అభిమానులను సైతం షాక్‌కు గురి చేసింది.


Click it and Unblock the Notifications











