త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్ట్స్ ఆ ఇద్దరు హీరోలతో...
స్టార్ రైటర్ నుంచి దర్శకుడుగా మారి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని పెద్ద పెద్ద నిర్మాతలు ఉవ్విళ్ళూరుతుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఆయన తాజాగా రెండు ప్రాజెక్టులు కమిటయ్యారు. ఆ రెండూ...వెంకటేష్ తోనూ, రామ్ చరణ్ తోనూ రూపొందే చిత్రాలు. వెంకటేష్ హీరోగా చేసే చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారు. ఇక రామ్ చరణ్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ తో ఖలేజా చిత్రం ఫినిషింగ్ టచ్ లో ఉన్నారు త్రివిక్రమ్. ఈ చిత్రం సినిమా దాదాపు పూర్తయింది. రెండు పాటలే మిగి లివున్నాయి. సెప్టెంబర్ లో విడుదలవుతుంది. ఇక వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ షూటింగ్ లో ఉన్నారు. రామ్ చరణ్..మెరుపు, ఆరంజ్ చిత్రాలు చేస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ రామ్ చరణ్ తేజ్ ఖలేజా trivikram srinivas venkatesh ram charan teja jalsa khaleja


Click it and Unblock the Notifications