త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మళ్ళీ...
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో జల్సా చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయటానికి ఓ మెగా ప్రొడ్యూసర్ ఒప్పించారని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం వచ్చే సంవత్సరం పిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తన తాజా చిత్రం ఖలేజా రిలీజ్ హడావిడిలో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ దర్సకత్వంలో ఖుషీగా అనే చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కిది రీమేక్. పవన్ సరసన త్రిష ఈ చిత్రంలో చేస్తోంది. అలాగే త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైలాగులు రాయటం మరో విశేషం. ఇక త్రివిక్రమ్..నెక్ట్స్ వెంకటేష్ తో చిత్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ చిత్రం అనంతరం పవన్ తో చేసే చిత్రం ఉంటుంది.


Click it and Unblock the Notifications











