పవన్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్.. లైనప్ లో మరో పాన్ ఇండియా సినిమా.. ఆ స్టార్ డైరెక్టర్ తో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా వకీల్ సాబ్ మంచి స్పందన తెచ్చుకుంది. ఏప్రిల్ నెల 9న థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కలెక్షన్స్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేని పరిస్థితి. అయితే పవన్ ఇప్పటికే మరి కొన్ని సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి కాక అనూహ్యంగా మరో కాంబో చర్చల్లోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Vakeel Saab : చరిత్ర సృష్టించిన Pawan Kalyan, తన రికార్డ్ తానే కొల్లగొట్టాడు!!
వకీల్ సాబ్ మానియా

వకీల్ సాబ్ మానియా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టారు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు ఒకటి కాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ షూటింగ్, ఈ రెండు సినిమాలు కొంత మేర పూర్తి చేశారు.

లైనప్ మామూలుగా లేదు

లైనప్ మామూలుగా లేదు

ఇక పవన్ ఈ సినిమాలు కాక మరో మూడు సినిమాలు కూడా అనౌన్స్ చేశాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక వీరిద్దరితో కాకుండా పవన్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా కూడా ఒకటి అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ విషయం పక్కన పెడితే ఆయన తనకు సన్నిహితుడు అయిన మరో దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కరోనా రెస్ట్ మోడ్

కరోనా రెస్ట్ మోడ్

పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన కోలుకున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. పవన్ కు కరోనాతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా ఏర్పడడంతో ఆయన మరి కొన్నాళ్లపాటు రెస్టు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేసే ఉందని అంటున్నారు.

పవన్ - త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా

పవన్ - త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఒక పాన్-ఇండియన్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు త్రివిక్రమ్ ఇప్పటికే మొత్తం స్క్రిప్ట్ పనిని పూర్తి చేశాడని దానిని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. అయితే, ఆయన అంతకుముందే మహేష్ బాబు సినిమాని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత మాత్రమే పవర్ స్టార్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

వచ్చే నెల నుంచి షూట్

వచ్చే నెల నుంచి షూట్

మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా తన లైనప్ లో ఉన్న పలు ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. జరుగుతున్న ప్రచారం మేరకు వచ్చే నెల నుండి క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీర మల్లు అలానే సాగర్ కే చంద్ర అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X