మహేష్ కోసం త్రివిక్రమ్ పాన్ ఇండియా స్కెచ్.. విలన్‌గా తమిళ స్టార్ హీరో
ప్రస్తుతం తెలుగు సినీ నిర్మాతలు చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న సినిమాలు మినహాయించి ఒక మాదిరి హీరో అని అనుకుంటే చాలు పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస సినిమాలతో
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో హిట్స్ కొడుతున్నాడు. తాజాగా సర్కారువారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నా సినిమాకి మంచి టాక్ వచ్చింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి..

రకరకాల వార్తలు
ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ పూజా హెగ్డే ఫైనల్ అయింది. సినిమాలో ఇంకెవరు నటిస్తున్నారనే విషయం మీద క్లారిటీ లేక పోవడంతో సినిమా గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

ఎంగేజ్ చేసే విధంగా
తాజాగా అదే మేరకు మరో వార్త పుట్టుకొచ్చింది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా నటించేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.. సినిమా కచ్చితంగా పాన్ ఇండియా లెవల్లో ఉండేలాగా చూసుకోవడానికి త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారని హిందీ ఆడియన్స్ ని టచ్ చేయలేకపోయినా కనీసం తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

స్క్రిప్ట్ ఫైనల్ దశలో
అందులో భాగంగానే విజయ్ సేతుపతితో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారని, ప్రస్తుతానికి చర్చలు అయితే జరగలేదు కానీ స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉండటంతో స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి కలిసి స్క్రిప్ట్ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్ సేతుపతి కనుక సినిమాల్లోకి వస్తే తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చు.

మార్కెట్ పెరిగే అవకాశం
మూడు భాషల ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ సేతుపతితో కొంత వరకు మార్కెట్ పెరిగే అవకాశం ఉందని కూడా త్రివిక్రమ్ భావిస్తున్నాడని అంటున్నారు. మరి దీని మీద ఎప్పటికీ క్లారిటీ వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ సినిమాకు సంబంధించిన మరెలాంటి విషయాలు బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











