SSMB28: మహేశ్ త్రివిక్రమ్ మూవీ స్టోరీ లీక్.. ఇండియాలోనే తొలిసారి ఈ ప్రయోగం

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, ఫైట్స్, స్టైల్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో సందడి చేస్తూ సుదీర్ఘ కాలంగా బడా హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మరింత ఫామ్‌తో కనిపిస్తోన్న మహేశ్.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

వరుస హిట్లతో మహేశ్ ఫుల్ ఫామ్

వరుస హిట్లతో మహేశ్ ఫుల్ ఫామ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకోవడమే. ఇలా హ్యాట్రిక్‌ను కూడా అందుకున్న ఈ స్టార్ హీరో.. అలాగే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి సత్తాను నిరూపించుకున్నాడు.

టార్గెట్ చేరని సర్కారు వారి పాట

టార్గెట్ చేరని సర్కారు వారి పాట

ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేశాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఓపెనింగ్ బాగానే ఉన్నా టార్గెట్‌ను చేరుకోలేదు.

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు మూవీ

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు మూవీ


హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు.. త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

సినిమా షూటింగ్ మరింత లేటు

సినిమా షూటింగ్ మరింత లేటు

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించాల్సిన సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ ఆలస్యం అవడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో కొద్ది రోజుల క్రితమే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా వైరస్ కూడా సోకింది. అలాగే, ఫారెన్ ట్రిప్ వెళ్లి వచ్చాడు. దీంతో ఈ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుందట.

మహేశ్ కోసం బడా స్టార్లు కూడా

మహేశ్ కోసం బడా స్టార్లు కూడా

దాదాపు పదేళ్ల తర్వాత తివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండడంతో దీనిపై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని గురూజీ ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారట. ఇప్పటికే ఆయన ఫుల్ స్టోరీ రెడీ చేయగా.. థమన్ కొన్ని ట్యూన్స్ కూడా సిద్ధం చేశాడు. ఇక, ఇందులో బడా స్టార్లను కూడా భాగం చేస్తున్నారని టాక్.

మహేశ్ త్రివిక్రమ్ మూవీ స్టోరీ లీక్

మహేశ్ త్రివిక్రమ్ మూవీ స్టోరీ లీక్


క్రేజీ కాంబినేషన్‌ కావడంతో మహేశ్ బాబు - త్రివిక్రమ్ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందించబోతున్నట్లు ఓ న్యూస్ లీకైంది. అది కూడా అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తారట.

ఇండియాలో తొలిసారి ప్రయోగం

ఇండియాలో తొలిసారి ప్రయోగం


మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చే మూవీ ఇండియాలో రాజకీయం ఓ వ్యాపారంగా ఎలా మారంది? దీని వల్ల సమాజం ఏం కోల్పోతుంది? అనే విషయాలను సందేశాత్మకంగా చూపించబోతున్నారట. అయితే, దీన్ని ప్రజెంట్ చేసే విధానం ఇండియాలో ఏ సినిమాలో చూపించని విధంగా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X