బడా నిర్మాతకు అడ్వాన్స్ తిరిగిచ్చేసిన త్రివిక్రమ్.. నాలుగేళ్ళ క్రితమే, తదుపరి ప్రాజెక్ట్స్ రెండూ!

Recommended Video

Trivikram Returns Advance To DVV Danayya

మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్. త్రివిక్రమ్ దర్శత్వంలో నటించేందుకు బడా హీరోలు ఆసక్తి చూపుతారు. ఆయన దర్శకత్వ శైలి భిన్నంగా ఉంటుంది. తాజగా త్రివిక్రమ్ శ్రీనివాస్, బడా నిర్మాత డివివి దానయ్య మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్, దానయ్య ఇద్దరూ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

నాలుగేళ్ళ క్రితమే

నాలుగేళ్ళ క్రితమే

త్రివిక్రమ్ చిత్రాలలో మాటలు, వినోదం, దర్శకత్వ శైలి ఇలా అన్ని అంశాలతో ఆయన చిత్రాలు మళ్ళీ మళ్ళీ చూసే విధంగా ఉంటాయి. నాలుగేళ్ళ క్రితమే దానయ్య నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రాజెక్ట్ చేయవలసిందట. త్రివిక్రమ్ కు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా అది కుదర్లేదు.

 అడ్వాన్స్ ఇచ్చేయమని

అడ్వాన్స్ ఇచ్చేయమని

దర్శకుడి డేట్స్ కుదిరాకే అడ్వాన్స్ ఇచ్చే దానయ్య.. త్రివిక్రమ్ కు మాత్రం ముందుగానే కొంత మొత్తం ఇచ్చారట. త్రివిక్రమ్ బిజీగా మారడం, ఇతర కారణాల వలన వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. దానయ్య అడ్వాన్స్ ఇచ్చి నాలుగేళ్లు గడచిపోయినట్లు తెలుస్తోంది. దీనితో అడ్వాన్స్ కోసం దానయ్య త్రివిక్రమ్ ని అడిగారట. త్రివిక్రమ్ ఆ అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచేసినట్లు తెలుస్తోంది.

 భారీ చిత్రాలతో

భారీ చిత్రాలతో

దానయ్య ఇటీవల భరత్ అనే నేను వంటి బడా చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో రాజమౌళితో మల్టీస్టారర్ చిత్రాన్ని దానయ్య నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు మూడేళ్లవరకు దానయ్య బిజీనే.

 త్రివిక్రమ్ తదుపరి రెండు చిత్రాలు

త్రివిక్రమ్ తదుపరి రెండు చిత్రాలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అరవింద సమేత దసరాకు విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే రెండు సినిమాలు ఖారైనట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. వెంకటేష్, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తదుపరి చిత్రాలు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మారనున్న నిర్మాతలు

మారనున్న నిర్మాతలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా హారిక అండ్ హాసిని బ్యానర్ రాధాకృష్ణ నిర్మాణంలోనే సినిమాలు చేస్తున్నారు. వెంకటేష్, అల్లు అర్జున్ చిత్రాలని త్రివిక్రమ్ వేరే నిర్మాతలతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X