ఆ అమ్మాయి కోసం త్రివిక్రమ్ సంచలన నిర్ణయం: మహేశ్ మూవీ రిజెక్ట్ చేయడంతో స్టోరీ మార్చేసి!
ఈ మధ్య కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్లు మీద హిట్లు కొడుతూ యమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఓ సినిమాను మొదలు పెట్టిన అతడు.. అది షూటింగ్ జరుపుకుంటుండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను ప్రకటించాడు. ఇటీవలే అధికారికంగా మొదలైన ఈ మూవీలో 'పెళ్లి సందD' హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

‘సర్కారు వారి పాట'లో మహేశ్
ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అదిస్తున్నాడు. ఇది చాలా వరకూ షూట్‌ను పూర్తి చేసుకుంది.

స్టార్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటన
మహేశ్ బాబు తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

ఆలస్యం అవుతూనే ఉన్న ఫిల్మ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పుడో మొదలు కావాల్సింది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా సోకింది. దీంతో అతడి షూటింగ్ ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. దీంతో ఇది మరింత ఆలస్యం కానుంది.

పనులన్నీ పూర్తి... నటుల కోసమే
సూపర్ స్టార్‌తో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఈ మూవీ కోసం గురూజీ ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడని ఎప్పుడో న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడట. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు నటుల ఎంపిక మీద దృష్టి సారించారని సమాచారం.

మరోసారి ఆ సెంటిమెంట్ కూడా
త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండడం సర్వసాధారణమే. ఇందులో భాగంగానే మహేశ్ బాబుతో రాబోయే సినిమాలో నటించేందుకు బుట్టబొమ్మ పూజా హెగ్డేను లీడ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం చాలా మంది పేర్లను పరిశీలించారనే టాక్ వినిపించింది.

మహేశ్ బాబుతో కుర్ర హీరోయిన్
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో నటించే సెకెండ్ హీరోయిన్ గురించి ఇటీవలే మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఊహించని హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను తీసుకుంటున్నారట. ఇప్పటికే ఆ చర్చలు కూడా ముగిశాయని టాక్. దీని గురించి త్వరలోనే ప్రకటన రానుందట.
Recommended Video

ఆమె కోసం స్టోరీ మార్చిన గురూజీ
వాస్తవానికి ఈ సినిమాలో శ్రీలీలకు తక్కువ నిడివి ఉన్న పాత్రనే రాసుకున్నారట. అయితే, దీన్ని చేయడానికి ఆమె నిరాకరించిందని తెలిసింది. దీంతో త్రివిక్రమ్ ఏకంగా ఈ కుర్ర హీరోయిన్ కోసం స్క్రిప్టునే మార్చారని విశ్వసనీయంగా తెలిసిందే. అంతేకాదు.. ఈ సినిమాలో మహేశ్ బాబుతో శ్రీలీలకు ఓ పాటను కూడా పెట్టారని అంటున్నారు. ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











